IDRBT : హైదరాబాద్ ఐడీఆర్ బీటీలో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

Hyderabad Idrbt
IDRBT : భారత ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్ బీటీ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సైబర్ సెక్యురిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, 5జీ అండ్ బియాండ్ నెట్‌వర్క్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.70,900ల నుంచి రూ.1,01,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ , ఐడీఆర్ బీటీ , కాజిల్ హిల్స్, రోడ్ నెం 1, మసబ్ ట్యాంక్, హైదరాబాద్- 57, దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 18, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.idrbt.ac.in/సంప్రదించగలరు.