NHAI JOBS : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే లాడిగ్రీ, హిందీలో స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

NHAI JOBS : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

National Highways Authority Of India

Updated On : May 23, 2022 / 1:36 PM IST

NHAI JOBS : భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, హిందీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 48 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే లాడిగ్రీ, హిందీలో స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే సెలక్షన్ కమిటీ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 39,100 రూ వేతనంగా చెల్లిస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ లేదంటే ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; డీజీఎం (హెచ్ ఆర్ అండ్ అడ్మిన్) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ), సెక్టార్ 10, ద్వారకా, న్యూఢిల్లీ 110075, ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 24, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.nhai.gov.in/పరిశీలించగలరు.