Job Replacement : ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

Job Replacement : ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీ

Ntpc Jobs

Updated On : March 25, 2022 / 12:05 PM IST

Job Replacement : నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్ టీ పీసీ)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులు భర్తీ చేయనున్నారు. కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ ఓఅండ్ఎం, ఆపరేషన్స్ పవర్ ట్రేడింగ్, బిజెనెస్ డెవలప్ మెంట్ పవర్ ట్రేడింగ్ తదితర విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 8ని నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ బైట్ : WWW.ntpc.co.in/en సంప్రదించగలరు.