ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ

Job Replacement In Ongc

Updated On : May 21, 2022 / 1:35 PM IST

ONGC JOBS : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఒఎన్జీసీ)లో ఉద్యోగాల భర్తీ చేపటనున్నారు. ఆ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్ వైజర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మెరైన్ రేడియో, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 28, 2022ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.ongcindia.com పరిశీలించగలరు.