SBI PO Recruitment 2025: ఎస్బీఐ పీవో పోస్టుల రిజిస్ట్రేషన్ కు ఇవాలే లాస్ట్ డేట్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండి.. పూర్తి వివరాలు మీకోసం

SBI PO Recruitment 2025: ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ప్ విడుదలైన విషయం తెలిసిందే. జూన్ 24 నుంచి దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతింది.

SBI PO Recruitment 2025: ఎస్బీఐ పీవో పోస్టుల రిజిస్ట్రేషన్ కు ఇవాలే లాస్ట్ డేట్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండి.. పూర్తి వివరాలు మీకోసం

July 14th is the last date for SBI PO Recruitment 2025 Registration

Updated On : July 14, 2025 / 3:29 PM IST

ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ప్ విడుదలైన విషయం తెలిసిందే. జూన్ 24 నుంచి దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతింది. ఇక ఇవాళ్టితో(జులై 14) ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. మొత్తం 541 ప్రొబిషనరీ ఆఫీసర్ భర్తీ కోసం జరుగనున్న ఈ ఎగ్జామ్ కోసం ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి మీకు కూడా ఆసక్తి ఉంటే వెంటనే ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇవాళే చివరి తేదీ.

విద్యార్హతలు:
అభ్యర్థులు UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఇతర తత్సమాన అర్హతలను కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ చివరి సంవత్సరం లేదా సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డ్యూయల్ డిగ్రీ అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోపు తమ చివరి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు రుజువును సమర్పించాలి. మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ మొదలైన అర్హత కలిగిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

వయోపరిమితి:
అభ్యర్థులు ఏప్రిల్ 1, 2025 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, సైకోమెట్రిక్ ఎగ్జామ్, తుది రౌండ్‌గా ఉంటాయి.

ఇలా అప్లై చేసుకోండి:

  • ముందుగా sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి.
  • కెరీర్స్ ట్యాబ్‌కు వెళ్లి ప్రస్తుత ఖాళీలపై క్లిక్ చేయాలి.
  • SBI PO 2025 రిక్రూట్‌మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి
  • అందులో ‘ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మెయిల్ ID, మొబైల్ నంబర్ తో రిజిస్టర్ అవ్వాలి
  • ఇప్పుడు అవసరమైన సమాచారంతో దరఖాస్తును నింపాలి.
  • అవసరమైన పత్రాలను జత చేయాలి.
  • దరఖాస్తు రుసుము చెల్లించాలి
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి