IBPS PO 2025 Recruitment: ఐబీపీఎస్ పీవో రిజిస్ట్రేషన్ ఇవాళే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేసుకోండి.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

IBPS PO 2025 Recruitment: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ (PO/MT) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

IBPS PO 2025 Recruitment: ఐబీపీఎస్ పీవో రిజిస్ట్రేషన్ ఇవాళే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేసుకోండి.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

July 21 is the last date for IBPS PO registration process.

Updated On : July 21, 2025 / 10:33 AM IST

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ (PO/MT) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 1 నుంచి మొదలుకాగా ఇవాళ్టి (జులై 21)తో ముగియనుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ibps.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ప్రీ-ఎగ్జామినేషన్ శిక్షణ నిర్వహించి, ప్రిలిమ్స్ కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. కానీ, పరీక్షకు సంబంధించిన తేదీ మాత్రం అడ్మిట్ కార్డులపై పేర్కొనబడుతుంది.

ఐబీపీఎస్ పీవో 2025 ముఖ్యమైన తేదీలు:

  • ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో ఉంటుంది
  • ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ ఫలితం సెప్టెంబర్ లో ఉంటాయి
  • మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల
  • మెయిన్స్ పరీక్ష అక్టోబర్ లో ఉంటుంది
  • మెయిన్స్ ఫలితాలు నవంబర్లో విడుదల అవుతాయి
  • పర్సనాలిటీ టెస్ట్ నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది
  • ఇంటర్వ్యూ డిసెంబర్ 2025 లో లేదా జనవరి 2026 లో ఉంటుంది
  • తాత్కాలిక కేటాయింపు 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది.

ఐబీపీఎస్ పీవో 2025 అర్హత ప్రమాణాలు:

వయోపరిమితి:
జూలై 1, 2025 నాటికి, అభ్యర్థుల వయసు కనీసం 20 నిండి 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు రుసుము:
SC/ST/PwBD అభ్యర్థులు రూ.175, మిగతా వారందరూ రూ.850 చెల్లించాల్సి ఉంటుంది.