Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బంగారం కంపెనీలో జాబ్స్, రూ.2.4 లక్షల జీతం.. అర్హతలు, పూర్తి వివరాలు
Job Mela: కరీంనగర్ జిల్లాలోని కళ్యాణ్ జ్యువెలరీ ఇండియా లిమిటెడ్ తమ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ట్రైనర్స్, ఫ్లోర్ హోస్ట్స్, సూపర్వైజర్స్ ఆఫీస్ బాయ్ లాంటి 60 పోస్టులు ఉన్నాయి.

Kalyan Jewellery India Limited to hold job fair on July 29 in Karimnagar
చదువు పూర్తి చేసి మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ బంగారం లాంటి అవకాశం మీకోసమే. అది కూడా బంగారం షాప్ లోనే. అవును కరీంనగర్ జిల్లాలోని కళ్యాణ్ జ్యువెలరీ ఇండియా లిమిటెడ్ తమ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ట్రైనర్స్, ఫ్లోర్ హోస్ట్స్, సూపర్వైజర్స్ ఆఫీస్ బాయ్ లాంటి 60 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈమేరకు జులై 29న జాబ్ మేళా నిర్వహించనుంది. కరీంనగర్ బాస్ స్టాండ్ పక్కన ఉన్న ప్రతిమ మల్టిప్లెక్స్ ప్రాంతంలో ఈ జాబ్ మేళా జరుగనుందని జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు తెలిపారు. కాబట్టి ఆసక్తి, అర్హత ఉన్న యువత తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విద్యార్హత:
ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఆపై చదువులు చదివిన మేల్, ఫిమేల్ అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ ఫేసింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
కరీంనగర్ జిల్లాలోని కళ్యాణ్ జ్యువెలరీ ఇండియా లిమిటెడ్ తమ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ట్రైనర్స్, ఫ్లోర్ హోస్ట్స్, సూపర్వైజర్స్ ఆఫీస్ బాయ్ లాంటి 60 పోస్టులు ఉన్నాయి.ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 19 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
జీతం వివరాలు:
ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 జీతం ఇస్తారు.
కావాల్సిన ధ్రువపత్రములు:
విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్, జిరాక్స్ సెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో తదితర పాత్రలను తీసుకురావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం 9944 922677, 9052259333 నంబర్స్ ను సంప్రదించవచ్చు.