Distance Learning Courses : దూరవిద్యా విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 31లోగా అప్లయ్ చేసుకోండి.. యూనివర్శిటీల ఫుల్ లిస్టు!
Distance Learning Courses : ఆన్‌లైన్, దూరవిద్య విధానంలో కోర్సులను అందిస్తున్న మొత్తం 80 యూనివర్శిటీల జాబితా విడుదల అయింది. దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుకు ఈ నెల 31వరకు అవకాశం ఉంది.

Last Date To Apply For Distance Learning Courses Is March 31
Distance Learning Courses : దూరవిద్య కోర్సుల కోసం చూసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. దూరవిద్య కోర్సులను అందించే యూనివర్శిటీలకు సంబంధించిన జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది. ఈ జాబితాలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌లను అందించే గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల (HEIs)లు ఉన్నాయి.
ప్రత్యేకించి ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులలో అడ్మిషన్ కోసం చూసే అభ్యర్థులు యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీల జాబితా అందించే కోర్సులను చెక్ చేయవచ్చు. ఆన్‌లైన్, దూరవిద్య విధానంలో కోర్సులను అందిస్తున్న మొత్తం 80 యూనివర్శిటీల జాబితాను యూనివర్సిటీ విభాగం విడుదల చేసింది. పూర్తి జాబితా కోసం ఈ లింక్ (https://deb.ugc.ac.in/Uploads/Notices_Upload/UGC_20240321154807_1.pdf) ద్వారా తెలుసుకోండి.
దరఖాస్తుకు గడువు తేదీ మార్చి 31 :
యూజీసీ (ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు) నిబంధనలు, 2020, సవరణల కింద విద్యా సంస్థలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా హెచ్ఈఐల జాబితా విడుదల చేసింది. ఫిబ్రవరి, 2024 అకడమిక్ సెషన్ విషయానికి వస్తే.. ఓడీఎల్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం చివరి తేదీ మార్చి 31, 2024గా నిర్ణయించింది. యూజీసీ-డీఈబీ వెబ్ పోర్టల్‌లో విద్యార్థుల ప్రవేశ వివరాలను అప్‌లోడ్ చేయడానికి ఏప్రిల్ 15, 2O24 తుది గడువుగా చెప్పవచ్చు.
హెచ్ఈఐలు అందించే ప్రోగ్రామ్‌లు రెగ్యులేటరీ అథారిటీల పరిధిలో ఉన్నాయని, సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నుంచి పొందిన ఎన్ఓసీ/ ఆమోదం/ సిఫార్సుల ఆధారంగా పరిగణించడం జరుగుతుందని యూజీసీ వెల్లడించింది. కోర్సును అందిస్తున్న హెచ్ఈఐలు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ లేఖలో పేర్కొన్న సీట్ల సంఖ్యకు సంబంధించి విద్యా సంవత్సరం మొదలైన షరతులను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని యూనివర్సిటీ విభాగం పేర్కొంది.
Read Also : UGC NET Exam Date 2023 : యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూలు విడుదల.. డిసెంబర్ 6 నుంచి 14 వరకు పరీక్షలు