UGC NET Exam Date 2023 : యూజీసీ నెట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల.. డిసెంబర్‌ 6 నుంచి 14 వరకు పరీక్షలు

పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్‌ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీలో కనీసం అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ఎంపిక చేస్తారు.

UGC NET Exam Date 2023 : యూజీసీ నెట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల.. డిసెంబర్‌ 6 నుంచి 14 వరకు పరీక్షలు

UGC NET Exam

UGC NET Exam Date 2023 : దేశంలోని వివిధ యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (Assistant professor), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం నిర్వహించనున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023 (UGC NET) పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. డిసెంబర్‌ 6 నుంచి 14 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను 2024, జనవరి 10న వెల్లడించనున్నారు.

READ ALSO : RGUKT AP FACULTY JOBS 2023 : రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ ఏపిలో ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు !

పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను పరీక్షకు 10 రోజుల ముందుగా అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్ష జరగనుంది. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో జరగనున్నాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి షిఫ్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్‌ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీలో కనీసం అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ఎంపిక చేస్తారు.

READ ALSO : Amazon Alexa Layoffs : అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల్లో కోతలు.. ఇప్పుడు అలెక్సా వంతు.. వందలాది మంది ఉద్యోగులపై వేటు!

పరీక్ష విధానం ;

ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం కేటాయిస్తారు.

పేపర్-1కు గంట సమయం కేటాయిస్తారు. పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుండి ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో చదివిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

READ ALSO : Miss Universe 2023 : మిస్ యూనివర్స్ కిరీటం కోసం భారత్ తరపున పోటీపడుతున్న శ్వేతా శారద ఎవరు?

ఏపీలో పరీక్ష లో కేంద్రాలు: అమరావతి, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం,అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ పరిధిలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, , నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్

READ ALSO : Railway Apprentice Recruitment 2023 : నార్త్ సెంట్రల్ రైల్వే లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

నెట్‌ అర్హత సాధిస్తే ;

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాతో అధ్యాపక వృత్తిని చేపట్టవచ్చు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పే స్కేల్‌ను ప్రారంభంలోనే నెలకు రూ.67 వేలు బేసిక్‌ పే అందుకోవచ్చు.

జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైనవారు ప్రముఖ రీసెర్చ్‌ లేబొరేటరీల్లో రెండేళ్లపాటు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా, ఆ తర్వాత మరో రెండేళ్లు సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా అవకాశం లభిస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేల ఫెలోషిప్‌ అందుతుంది. జేఆర్‌ఎఫ్‌ పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్‌ అందుతుంది.

READ ALSO : Health Tips : ఈ 5 రకాల పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దు ? ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్నవారు సైంటిస్ట్‌లుగా ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవచ్చు. ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్‌ అభ్యర్థుల ఎంపికలో నెట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యతనిస్తారు. అదే క్రమంలో ఆర్ట్స్,హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్‌ స్కాలర్స్‌గా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.

యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 011-40759000 ఫోన్ నెంబరుకు సంప్రదించాలి. ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా కూడా సంప్రదించవచ్చు.