నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. మెగా ఫార్మా జాబ్ మేళా.. రూ.2.5 లక్షల జీతం.. డేట్, టైమ్, ఇతర డిటెయిల్స్
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మెగా ఫార్మా జాబ్ మేళా జరుగనుంది.

Job mela in Vijayanagaram
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మెగా ఫార్మా జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పెంటమ నాయుడు అధికారిక ప్రకనట చేశాడు. ఈ మెగా జాబ్ మేళా జూన్ 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలని, మహిళలకు అవకాశం లేదని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అధికారులు సూచించారు.
విద్యార్హత: ఇంటర్మీడియట్, బైపీసీ, ఎంపీసీ, డిప్లొమా, బిఎస్సీ కెమిస్ట్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ పాసై ఉండాలి. 2020 నుంచి 2025 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారికీ మాత్రమే అవకాశం.
వయోపరిమితి: ఈ జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల లోపు వారై ఉండాలి.
వేతన వివరాలు: అర్హతను బట్టి సంవత్సరానికి రూ.2.1 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ఉచిత రవాణా సదుపాయం, భోజన వసతి, నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా లభిస్తుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్‌లో ఉండాలని, మరిన్ని వివరాల కోసం 8142194787, 9182063878 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.