దరఖాస్తు చేసుకోండి : NEET-2020 అడ్మిషన్లు ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజిలకి సంబంధించిన MBBS, BDS, ఆయుష్, వెటర్నరీ, పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) సంవత్సరానికి ఒకసారి మాత్రం నిర్వహిస్తారు. ఈ పరీక్షకు దేశంమంతటా 154 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
విభాగాల వారీగా సీట్ల ఖాళీల :
> మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 529 మెడికల్ కాలేజిల్లో 75వేల 893 MBBS సీట్లు ఉన్నాయి.
> డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 313 డెంటల్ కాలేజిల్లో 26 వేల 693 BDS సీట్లు ఉన్నాయి.
> ఇదే విధంగా ఎయిమ్స్ లో 1205, జిపమర్ లో 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
విద్యార్హత :
అభ్యర్ధులు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్ధులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. SC,ST, EWS, OBS అభ్యర్ధులు కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్ధులు రూ.1500 చెల్లించాలి. EWS , OBS అభ్యర్ధులు రూ.1400 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, ట్రాన్స్ జండర్స్ మాత్రం రూ. 800 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 02, 2019.
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 31, 2019.
ఫీజు చెల్లించడానికి చివరి తేది : జనవరి 01, 2020.
అప్లికేషన్ కరెక్షన్ తేదిలు : జనవరి 15, 2020 నుంచి జనవరి 31, 2020.
అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ : మార్చి 27, 2020.
పరీక్ష తేది : మే 3, 2020.
పరీక్ష ఫలితాల వెల్లడి తేది : జూన్ 4, 2020.