Cochin Shipyard : కొచ్చిన్ షిప్ యార్డులో జీఎంఈ కోర్సు.. ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

ఈ కోర్సులో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ద్వితీయ శ్రేణిలో మార్కులతో బీఈ, బీటెక్, (మెకానికల్,మెకానికల్ అండ్ అటోమేషన్, నేవల్ ఆర్కిటెక్చర్, నేవల్ అర్కిటెక్చర్ అండ్ ఓష

Cochin Shipyard : కొచ్చిన్ షిప్ యార్డులో జీఎంఈ కోర్సు.. ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

Cochin Shipyard

Updated On : October 1, 2021 / 2:48 PM IST

Cochin Shipyard : గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కోర్సులో ప్రవేశానికి కొచ్చిన్ షిప్ యార్డు లిమిడెట్ నోటిఫికేషన్ జారీచేసింది. కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఏడాది కాల వ్యవధి కలిగిన ఈ కోర్సుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు ఉంది.

ఈ కోర్సులో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం ద్వితీయ శ్రేణిలో మార్కులతో బీఈ, బీటెక్, (మెకానికల్, మెకానికల్ అండ్ అటోమేషన్, నేవల్ ఆర్కిటెక్చర్, నేవల్ అర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ ) ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి , ఇంటర్ స్థాయిలో ఇంగ్లీష్ ని ఒక సబ్జెక్ట్ గా చదవి 50శాతం మార్కులు సాధించి ఉండాలి.

అభ్యర్థుల వయస్సు.. కోర్సులో చేరే నాటికి 28 సంవత్సరాలకు మించరాదు. దరఖాస్తుకు చివరి తేది నవంబరు 30వ తేదిగా నిర్ణయించారు. 2022 జనవరి 1 వ తేది నుంచి కోర్సు ప్రారంభమౌతుంది. పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ cochinshipyard.in సంప్రదించాలి.