NxtWave: అదరగొట్టిన తెలుగు యువకులు.. వారి ఐడియాకు రూ.275 కోట్ల పెట్టుబడులు

గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ మా ప్రయాణంలో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యవంతులైన ఐటీ ప్రొఫెషనల్స్‌‭కి నిలయంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. మన యువత అత్యంత ప్రతిభావంతులు. వారికి కావాల్సింది సరైన శిక్షణ. జీపీసీతో కలిసి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో అంతర్జాతీయ స్థాయి శిక్షణను తెలుగు రాష్ట్రాలలో ప్రతి మూలకూ తీసుకువెళ్లి రేపటి ఆధునిక ఉద్యోగాలకు వారిని సిద్ధం చేస్తున్నాము

NxtWave: అదరగొట్టిన తెలుగు యువకులు.. వారి ఐడియాకు రూ.275 కోట్ల పెట్టుబడులు

NxtWave raises $33 million in funding round led by Greater Pacific Capital

Updated On : February 22, 2023 / 5:47 PM IST

NxtWave: ఉద్యోగాలు పొందడం కాదు, ఏదైనా ఐడియా తెలిస్తే సరిపోతుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరూ వస్తుంది. నేటి యువతరం కూడా ఇలా ఐడియాలతో అద్భుతాలు సాధిస్తున్నారు. అందులో మన తెలుగువారు కూడా అనేకం ఉన్నారు. తాజాగా ఓ ముగ్గురు తెలుగు పూర్వ విద్యార్థులు కొంత కాలం క్రితం ప్రారంభించిన ఒక ఆలోచన క్రమంగా విజయం సాధిస్తూ, తాజాగా 275 కోట్ల రూపాయల పెట్టుబడిని అందుకునే స్థాయికి చేరుకోవడం విశేషం. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న నెక్స్ట్‭వేవ్ (nextwave) అనే సంస్థ సాధించిన ఘనత ఇది. ఐఐటీ బొంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఐటీ హైదరాబాద్‌ పూర్వ విద్యార్ధులు అయినటువంటి శశాంక్‌ రెడ్డి గుజ్జుల (మిర్యాలగూడ), అనుపమ్‌ పెదర్ల (ఏలూరు), యు రాహుల్‌ అట్లూరి (గోదావరిఖని) ఈ కంపెనీని స్థాపించారు. అధునిక టెక్నాలజీ కెరీర్స్‌ కు సిద్ధం చేసే భారతదేశపు అతి పెద్ద ఆన్లైన్ ఎంప్లాయబిలిటీ ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు.

TSRTC: ఒడిశా-తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం.. ఇరు రాష్ట్రాల మధ్య 23 బస్సులు

కాగా, ఈ కంపెనీ తాజా ఫండింగ్‌ రౌండ్‌లో రూ.275 కోట్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ రౌండ్‌కి అగ్రగామి అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్ధ గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ (జీపీసీ) నేతృత్వం వహించింది. నెక్స్ట్ వేవ్ యొక్క ప్రస్తుత వెంచర్‌ ఇన్వెస్టర్‌ ఓరియోస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ సైతం ఈ రౌండ్‌ లో పాల్గొంది. యువకులలో కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలు పెంపొందించి ఐటీ ఉద్యోగాలు పొందేలా చేయడంలో నెక్స్ట్ వేవ్ అసాధారణ విజయం సాధించింది. గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్స్‌ మొదలుకొని ఫార్చ్యూన్‌ 500 సంస్ధల వరకు 1250కు పైగా కంపెనీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‭కు చెందిన వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను నియమించుకున్నాయి. మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక ప్రకారం రాబోయే పదేళ్లలో భారతదేశపు ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం పదమూడు లక్షల అరవై వేల కోట్ల విలువ ఉన్న ఎగుమతులు మూడేళ్లలో నలభై రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు అవుతుందని అంచనా. ఇది మన దేశ యువతకు అపారమైన కెరీర్‌ అవకాశాలను అందించనుంది. ఐటీ పరిశ్రమకు అనుగుణంగా ఉన్న కరికులం ద్వారా ఇండస్ట్రీ మరియు అకాడెమిక్స్ మధ్య అంతరాన్ని నెక్స్ట్ వేవ్ తొలగిస్తుంది.

Supreme Court: ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ పై ఏక్ నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఈ నూతన ఫండింగ్‌ గురించి నెక్స్ట్ వేవ్ కో–ఫౌండర్‌, సీఈఓ రాహుల్‌ అట్లూరి మాట్లాడుతూ ‘‘గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ మా ప్రయాణంలో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యవంతులైన ఐటీ ప్రొఫెషనల్స్‌‭కి నిలయంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. మన యువత అత్యంత ప్రతిభావంతులు. వారికి కావాల్సింది సరైన శిక్షణ. జీపీసీతో కలిసి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో అంతర్జాతీయ స్థాయి శిక్షణను తెలుగు రాష్ట్రాలలో ప్రతి మూలకూ తీసుకువెళ్లి రేపటి ఆధునిక ఉద్యోగాలకు వారిని సిద్ధం చేస్తున్నాము’’ అని అన్నారు. ఈ పెట్టుబడి గురించి ఓరియోస్‌ వెంచర్‌ పార్టనర్స్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ అనూప్‌ జైన్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో దాదాపు 63% మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలను పొందలేకపోతున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో దాదాపు 30 లక్షల టెక్‌ ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఇలాంటి పరిస్థితిలో సంవత్సరానికి 8 బిలియన్‌ డాలర్లు టెక్‌–అప్‌ స్కిల్లింగ్‌ అవకాశాలున్నాయి. ఈ అంతరాన్ని విజయవంతంగా నెక్స్ట్ వేవ్ తొలిగించింది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధమైంది’’ అని అన్నారు.