AP Inter Exams : నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వాటిపై నిషేధం..

ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

AP Inter Exams : నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వాటిపై నిషేధం..

Updated On : March 1, 2025 / 2:22 AM IST

AP Inter Exams : ఏపీలో నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఫస్టియర్ విద్యార్థులకు ఎగ్జామ్ జరగనుంది. మార్చి 3వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి.. 10 లక్షల 58వేల 892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 1535 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్లు మూసివేయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అధికారులు కీలక సూచన చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

Also Read : ఓ మై గాడ్.. ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు..! అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన దారుణం.. అసలేం జరిగిందో తెలుసా..

ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. 8.30 గంటలకు ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. కాగా, పరీక్ష మొదలైన తర్వాత నిమిషం లేటైనా విద్యార్థులను లోపలికి అనుమతించేది లేదని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు కాపీయింగ్‌ను నిరోధించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు ఫ్లైయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు, ఎలక్ట్రానిక్ డివైజ్ లకు అనుమతి లేదు. మార్చి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయి.