Idli Cancer : ఓ మై గాడ్.. ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు..! అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన దారుణం.. అసలేం జరిగిందో తెలుసా..

ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇడ్లీ తయారీలో..

Idli Cancer : ఓ మై గాడ్.. ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు..! అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన దారుణం.. అసలేం జరిగిందో తెలుసా..

Updated On : February 28, 2025 / 9:38 PM IST

Idli Cancer : హెల్తీ బ్రేక్ ఫాస్ట్ జాబితాలో ముందుగా గుర్తుకొచ్చేది ఏది అంటే.. ఎవరైనా ఠక్కున చెప్పేది ఇడ్లీ. ఆయిల్ అసలే వాడరు. మసాలాల అవసరమే లేదు. పైగా.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఇడ్లీకి అంత క్రేజ్. హెల్త్ బాగోలేనప్పుడు ఎవరైనా ముందుగా ప్రిఫర్ చేసే టిఫిన్ ఇడ్లీ. హెల్త్ కి ఇడ్లీ ఎంతో మంచిదని అందరూ నమ్ముతారు. దాని వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని విశ్వసిస్తారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇడ్లీ వల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీఇన్నీ కావు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన భయంకరమైన విషయం సంచలనంగా మారింది. ఇడ్లీ ప్రియులను బెంబేలెత్తిస్తోంది. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అదేమిటంటే.. ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు ఉందట.

ఇడ్లీకి, క్యాన్సర్ కి లింక్ ఏంటి?
ఏంటి షాక్ అయ్యారు కదూ. ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉండటం ఏంటి? ఇంతకీ ఇడ్లీకి, క్యాన్సర్ కి సంబంధం ఏంటి? అనే సందేహం అందరినీ నిద్ర లేకుండా చేస్తోంది. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ భయంకరమైన విషయం బయటపడింది. కర్నాటక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ ప్రకారం.. ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో హానికరం, క్యాన్సర్ బారిన కూడా పడొచ్చు.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా గుర్తింపు పొందిన ఇడ్లీలో కార్సినోజెనిక్స్ (క్యాన్సర్ కారకాల) ఉండటం దుమారం రేపింది. ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు ఉందని అక్కడి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ గుర్తించింది.

ఆ ఇడ్లీలలో క్యాన్సర్ కారకాలు..
ఫుడ్ సేఫ్టీ అధికారులు బెంగళూరులోని 251 హోటళ్లు, వీధి వ్యాపారుల నుంచి ఇడ్లీ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపారు. ల్యాబ్ నివేదిక ప్రకారం.. వీటిలో 51 నమూనాలు ప్లాస్టిక్ వాడకానికి పాజిటివ్ గా వచ్చాయి. ఆ ఇడ్లీలలో క్యాన్సర్ కారకాలు వెలుగుచూశాయి. ఆ ఇడ్లీలు తింటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందట.

Also Read : బంగారం ధరలు ఉన్నట్టుండి ఎందుకు తగ్గుతున్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు?

ఇడ్లీలో క్యాన్సర్ కారకాలు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు బిత్తరపోయారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. ఎక్కడి నుంచి ఇడ్లీలు సేకరించారో ఆ హోటల్స్ కి వెళ్లారు. అసలు ఇడ్లీలను ఎలా తయారు చేస్తున్నారో స్వయంగా చెక్ చేశారు. ఈ క్రమంలో భయంకరమైన విషయం బయటపడింది.

ఇడ్లీ తయారీలో క్లాత్ కు బదులుగా ప్లాస్టిక్ వాడకం..
చాలా హోటల్స్ లో ఇడ్లీలు తయారు చేయడానికి క్లాత్ కు బదులుగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. ఇదే ఇంత పెద్ద సమస్యకు కారణమైందని అధికారులు గుర్తించారు. ఇడ్లీ ప్యాకింగ్, సర్వింగ్ లోనూ ప్లాస్టిక్ నే వినియోగిస్తున్నారట. ఇడ్లీ వేడికి ప్లాస్టిక్ కరిగి అది క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని తేలింది. ఇడ్లీ పేట్ లో పిండి వేశాక దానిపై క్లాత్ వాడాల్సి ఉంటుందని.. అయితే ఈ మధ్య కాలంలో వస్త్రానికి బదులుగా ప్లాస్టిక్ షీట్లు వేస్తున్నట్లు గుర్తించామని అధికారులు చెప్పారు. దాని వల్లే క్యాన్సర్ కారకాలు బయటపడ్డాయని అంటున్నారు.

”వాస్తవానికి ఇడ్లీల తయారీకి శుభ్రంగా ఉండే కాటన్ వస్త్రాలు వాడతారు. అయితే, చాలా మంది హోటల్స్ నిర్వహకులు, వీధి వ్యాపారులు.. క్లాత్ కి బదులుగా ప్లాస్టిక్ షీట్స్ వాడేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ వేడికి కరిగి రసాయనాలు విడుదల చేస్తుంది.

అందులో కొన్ని కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు. చాలా ప్లాస్టిక్ షీట్స్ లో రసాయనాలు ఉంటాయి” అని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ అధికారులు షాకింగ్ విషయాలు చెప్పారు. ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది.

ప్లాస్టిక్ షీట్లలో బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ఇతర ఎండోక్రైన్ రసాయనాలు ఉంటాయి. ఇవి వేడి చేసినప్పుడు ఆహారంలోకి గ్రహించబడతాయి. ఈ ఆహారం టాక్సిన్లు, మైక్రోప్లాస్టిక్స్ ను విడుదల చేస్తాయి. అలాంటి ఫుడ్ తినడం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read : రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. నో ఎగ్జామ్.. జీతం ఎంతంటే?

ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఈ రసాయనాలు హార్మోన్ల పై ప్రభావం చూపిస్తాయి. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. అలాగే జీవక్రియ రుగ్మతలకు కారణం అవుతాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఫుడ్ వ్యాపారంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని అధికారులు సూచించారు.

51 హోటళ్లలో ఇడ్లీ తయారీలో పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నారని తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ తెలిపారు. క్యాన్సర్ కారకమైన పాలిథిన్ వాడకం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందన్నారు. ”ప్లాస్టిక్ అనేది కాన్సర్ కారక పదార్థం. ఇది ఆహారంలోకి చేరడం వల్ల తినడానికి సురక్షితం కాదు.

ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధిస్తాం. ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడుతున్న వారిపై చర్యలు తీసుకున్నాం. జరిమానాలు విధించాము. అంతేకాదు మరోసారి ప్లాస్టిక్ వాడము అనే హామీని వారి నుంచి తీసుకున్నాం” అని మంత్రి దినేష్ తెలిపారు. వంటలలో కార్సినోజెనిక్స్ కారకాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలపై ఆహార పరిశ్రమతో పాటు కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు.