డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 06:04 AM IST
డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు ప్రారంభం

Updated On : February 22, 2019 / 6:04 AM IST

ఏపీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో డిప్యూటీ సర్వేయర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు AP ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. 

* విద్యా అర్హత:
పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో ఒకేషనల్ సర్టిఫికేట్ కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

* వయసు పరిమితి:
అభ్యర్థుల వయసు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 
– దరఖాస్తు ప్రక్రియ మార్చి 13 వరకు కొనసాగనుంది. అయితే మార్చి 12 లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

* దరఖాస్తు ఫీజు: 
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాలి. SC, ST, BC, తెల్ల రేషన్‌కార్డు దారులకు, పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. 

* ఎంపిక విధానం: 
రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ పరీక్ష తేదీ వెల్లడించలేదు..మెయిన్ పరీక్షను  మే 22న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు.