మార్చి 15 నుంచి లాసెట్ కు ఆన్ లైన్ లో దరఖాస్తు

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 02:59 AM IST
మార్చి 15 నుంచి లాసెట్ కు ఆన్ లైన్ లో దరఖాస్తు

Updated On : February 20, 2019 / 2:59 AM IST

హైదరాబాద్‌ : ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో రాబోయే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్‌–2019కి మార్చి 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని లాసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 19 మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన లాసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈమేరకు ప్రవేశాల షెడ్యూల్ ను ఖరారు చేశారు. 

మే 20న ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 10న జారీ చేయనున్నారు. సిలబస్, అర్హతలు, ప్రాంతీయ కేంద్రాలపై చర్చించారు. ఎల్‌ఎల్‌బీ పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. పీజీ లా పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.800, ఇతరులకు రూ.1,000గా నిర్ణయించారు. వివరాలను https://lawcet.tsche.ac.in లో పొందవచ్చని తెలిపారు.