OICL Recruitment 2025: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.60 వేల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
OICL Recruitment 2025: ఒరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

OICL has released a notification for 500 Assistant posts.
మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా? ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఒరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్థలో ఉన్న 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్తియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 17తో ముగియనుంది. కాబట్టి.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు వవెంటనే అధికారిక వెబ్ సైట్ https://orientalinsurance.org.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
విద్యార్హత:
అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. SSC/Inter/Degree లో ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పకుండా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసిన రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత భాష చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
వేతన వివరాలు:
ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ..22,405 నుంచి రూ.62,265 వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు అభ్యర్థులకు మూడు రకాల టెస్ట్ లను నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 07, సెప్టెంబర్ 2025న ఉంటుంది, మెయిన్స్ పరీక్ష 10, అక్టోబర్ 2025న ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్.