Osmania Phd : 2016కు ముందు ఉస్మానియా పీహెచ్ డీ ప్రవేశాలు రద్దు

2016 కంటే ముందు పీహెచ్ డీ అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

Osmania Phd : 2016కు ముందు ఉస్మానియా పీహెచ్ డీ ప్రవేశాలు రద్దు

Osmania University

Osmania Phd : నాలుగేళ్ళలో పీహెచ్ డీ పూర్తి చేయాలన్న నిబంధనను పక్కా అమలు చేసేందుకు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు సిద్ధమయ్యారు. ఈనేపధ్యంలో పీహెచ్ డీ పరిశోధనలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల చివరి నాటికి పీహెచ్‌డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే అడ్మీషన్లు రద్దు చేయాలని నిర్ణయించారు.

ఆమేరకు 2016 కంటే ముందు పీహెచ్ డీ అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్‌డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్‌ను సమర్పించాలని యూనివర్శిటీ అధికారులు కోరారు.

20లోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ

ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

జేఎన్ టీయూ హెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ అమలు…

జేఎన్‌టీయూహెచ్‌ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని జేఎన్ టీ యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. నవంబర్‌ 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరును జేఎన్‌టీయూ హెచ్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామన్నారు. అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు.