Physiotherapist Jobs: ఫిజియోథెరపిస్ట్ లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తు, పూర్తి వివరాలు
Physiotherapist Jobs: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన ఫిజియోథెరపీ వైద్యులు, స్పీచ్ థెరపిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

Physiotherapist Jobs in Government Hospitals in Jayashankar Bhupalpally District
ఫిజియోథెరపీ వైద్యులుగా పని చేస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన ఫిజియోథెరపీ వైద్యులు, స్పీచ్ థెరపిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు డీఈవో ఎం. రాజేందర్ అధికారిక ప్రకటన చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 23లోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు.
ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు నాలుగున్నర ఏళ్ళు బిపిటి(BPT) కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే రాష్ట్ర పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక అభ్యర్థులై ఉండాలి. ఎమ్మెస్సీ, ఏఎస్ఎల్సి, బిఎస్సి డిప్లమా ఇన్ స్పీచ్ తెరఫీ లాంగ్వేజ్ కలిగి ఉండి ఆర్బీఐ రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి రోజు రూ.1000 చొప్పున గౌరవ వేతనం అందజేస్తారు.కాబట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆసక్తి, అర్హత కలిగిన ఫిజియోథెరపిస్టు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.