Prasar Bharati Vijayawada Recruitment 2023 : ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగాల భర్తీ
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో డిడి తీసి, గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు పంపే కవరు పైన 'Application for RNU' అని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

Akashvani Vijayawada
Prasar Bharati Vijayawada Recruitment 2023 : ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రసారభారతి ప్రాంతీయ వార్తా విభాగంలో క్వాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. విజయవాడ పరిసరప్రాంతంలో నివసించే అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్లైన్ విధానంలో నవంబరు 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
READ ALSO : Rahul Gandhi : కేసీఆర్ చదువుకున్న స్కూల్, కాలేజీ కాంగ్రెస్ నిర్మించినవే : రాహుల్ గాంధీ
ఖాళీల వివరాలు..
క్వాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలగు)
క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్ (తెలగు)
క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్
అర్హతలు ;
క్వాజువల్ న్యూస్ ఎడిటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జర్నలిజంలో డిగ్రీ లేదా పీజీ లేదంటే పీజీ డిప్లొమా లేదా రిపోర్టింగ్/ఎడిటింగ్లో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి.
READ ALSO : CM Jagan : అసైన్డ్ భూములపై పేదలకే పూర్తి హక్కులు : సీఎం జగన్
క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు వచ్చి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిఉండాలి. ప్రసారానికి అనుగుణంగా స్వరం కలిగి ఉండాలి. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే సామర్థ్యం తోపాటు, తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి.
క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు రేడియో ప్రొడక్షన్లో ప్రొఫెషనల్ డిప్లొమాతోపాటు 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తోపాటుగా ఆడియో ఎడిటింగ్లో నైపుణ్యం తప్పనిసరి.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయసు 28.11.2023 నాటికి 21 – 50 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజుగా .354 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.266 చెల్లించాలి. అభ్యర్థులు ‘Prasar Bharati, Akashvani, Vijayawada’ పేరుతో డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో డిడి తీసి, గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు పంపే కవరు పైన ‘Application for RNU’ అని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
READ ALSO : SBI Junior Associate 2023 : స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తుల పరిశీలన, అర్హతలు, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Head of Office Akashvani, Punnamathota, M.G. Road, Vijayawada – 520010.
దరఖాస్తుల విషయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9440674057 ఫోన్ నెంబరులో పనిదినాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చు.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 28.11.2023.