IBPS Clerk Notification : డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 4,045 క్లర్క్‌ ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

IBPS Clerk Notification : డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 4,045 క్లర్క్‌ ఉద్యోగాల భర్తీ

IBPS Clerk Notification

IBPS Clerk Notification : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) 2024-25 సంవత్సరానికిగాను బ్యాంకు ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.

READ ALSO : Benefits of Deep Ploughs : వేసవి దుక్కులతో నేల సత్తువ.. భూసారం పరిరక్షణతో పాటు చీడపీడల నివారణ

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4,045 క్లర్క్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Paddy Cultivation : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెరగనున్న వరిసాగు విస్తీర్ణం

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు జులై 21, 2023 చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో,మెయిన్స్‌ అక్టోబర్‌లో ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ibps.in/ పరిశీలించగలరు.