DRDO PXE Recruitment : డీఆర్ డీఓ పిఎక్స్ఈలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

2019, 2020, 2021, 2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.7000 నుంచి రూ.9000 వరకు చెల్లిస్తారు.

DRDO PXE Recruitment : డీఆర్ డీఓ పిఎక్స్ఈలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

DRDO PXE Recruitment

Updated On : August 24, 2022 / 1:30 PM IST

DRDO PXE Recruitment : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఒడిస్సా బాలాసోర్‌ లోని డీఆర్‌డీఓ ప్రూఫ్‌ అండ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(పీఎక్స్‌ఈ)లో పలు అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 73 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ చేస్తున్నారు. విభాగాల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు 9, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు 42, ట్రేడ్‌ అప్రెంటిస్‌లు 22 ఖాళీలు ఉన్నాయి.

కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర విభాగాల్లో ఈఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టులు, ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ,బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2019, 2020, 2021, 2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.7000 నుంచి రూ.9000 వరకు చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 02, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/ పరిశీలించగలరు.