ISRO Recruitment : ఇస్రోలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
ఖాళీల వివరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-273, టెక్నీషియన్ అప్రెంటిస్-162 ఉండగా సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, హోటల్ మేనేజ్‌మెంట్ తదతర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

Apprentice Vacancies
ISRO Recruitment : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) కేరళలో పలు అప్పెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 435 టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
ఖాళీల వివరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-273, టెక్నీషియన్ అప్రెంటిస్-162 ఉండగా సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, హోటల్ మేనేజ్‌మెంట్ తదతర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగాలను బట్టి 60 శాతం మార్కులతో BE/B.Tech/Bsc/Bcom/BA/Hotel Management/Engg. diploma ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంపికైన వారికి స్టైపెండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000 గా చెల్లించనున్నారు.
READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
అప్రెంటిస్ వ్యవధి ఏడాది కాలం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారికి 28 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ అధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 7-10-2023 గా నిర్ణయించారు. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం; ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, కమలసెరి, ఎర్నాకులం, కేరళ. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.vssc.gov.in/ పరిశీలించగలరు.