BSF Head Constable Recruitment : బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.

BSF Head Constable Recruitment : బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

BSF Head Constable Recruitment

Updated On : April 26, 2023 / 1:13 PM IST

BSF Head Constable Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 247 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ 217 ఖాళీలు, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ 30 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Tomato Cultivation : టమోటా సాగులో తెగుళ్లు , నివారణ పద్దతులు !

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.

READ ALSO : Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 12 మే 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్షను 04 జూన్ 2023 తేదీన నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bsf.gov.in/ పరిశీలించగలరు.