Cgpdtm Recruitment : కేంద్రప్రభుత్వ సంస్ధ సీజీపీడీటీఎం లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Cgpdtm Recruitment : కేంద్రప్రభుత్వ సంస్ధ సీజీపీడీటీఎం లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Cgpdtm Recruitment

Updated On : July 11, 2023 / 8:40 PM IST

Cgpdtm Recruitment : న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్ ఎ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

బయో-టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, బయో-కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్ , కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

READ ALSO : Organic Farmer : టీచింగ్ వదిలేసి.. ప్రకృతి వ్యవసాయం

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆగస్టు 4, 2023వ తేదీ తుదిగడువుగా నిర్ణయించారు. ప్రిలిమ్స్‌ సెప్టెంబర్‌ 3, 2023వ తేదీన నిర్వహిస్తారు. మెయిన్స్‌ అక్టోబర్‌ 1, 2023న ఉంటుంది. మెయిన్స్‌ ఫలితాలు అక్టోబర్‌ 16న విడుదలవుతాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://qcin.org/ పరిశీలించగలరు.