HSL VIZAG : విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టును బట్టి అభ్యర్దులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కోర్సులు , ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌, ఎల్‌ఎల్‌బీ, ఇంజినీరింగ్‌, డిగ్రీ, బీఈ, ఎంబీబీఎస్‌ , డిప్లొమా, ఎంసీఏ కోర్సులో యువకులు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

HSL VIZAG : విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Recruitment of job vacancies in Visakhapatnam Hindustan Shipyard

Updated On : September 25, 2022 / 11:32 AM IST

HSL VIZAG : హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నం లోని డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ లో 55 సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, చీఫ్‌ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, కన్సల్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. లీగల్‌, టెక్నికల్‌, సివిల్‌, సేఫ్టీ, హెచ్‌ఆర్‌, కమర్షియల్‌, డిజైన్‌, ప్లాంట్‌ మెయింటెనెన్స్‌, ఐటీ అండ్‌ ఈఆర్‌పీ, ఎలక్ట్రికల్‌, డైవింగ్‌ సిస్టమ్‌, కస్టమ్స్‌ అన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

పోస్టును బట్టి అభ్యర్దులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కోర్సులు , ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌, ఎల్‌ఎల్‌బీ, ఇంజినీరింగ్‌, డిగ్రీ, బీఈ, ఎంబీబీఎస్‌ , డిప్లొమా, ఎంసీఏ కోర్సులో యువకులు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన యువకులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.39,750ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hslvizag.in/ పరిశీలించగలరు.