SSC Recruitment : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ బ్రాంచ్‌ల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్ చదివిన వారు జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగ నియామకాలకు అర్హులు.

Staff Selection Commission
SSC Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పలు ఉద్యోగ ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌బి(నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర జలసంఘం,సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్,కేంద్ర జల, విద్యుత్ రీసెర్చ్ స్టేషన్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్, పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ బ్రాంచ్‌ల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్ చదివిన వారు జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగ నియామకాలకు అర్హులు. పోస్టులకు అనుగుణంగా 18 నుండి 32 ఏళ్ల వయసు ఉండాలి. కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది సెప్టెంబర్ 2, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://ssc.nic.in