AP High Court Recruitment : ఏపీ స్టేట్ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీ
అభ్యర్ధులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు. అలాగే నోటిఫికేషన్ జారీ అయిన తేదీకి రెండేళ్ల ముందుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇతర బార్ కౌన్సిల్‌లలో అడ్వకెట్‌గా నమోదు చేసుకుని ఉండరాదు.

AP High Court Recruitment
AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఏపీ స్టేట్ హైకోర్టులో క్లర్క్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 26 లా క్లర్క్ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు. అలాగే నోటిఫికేషన్ జారీ అయిన తేదీకి రెండేళ్ల ముందుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇతర బార్ కౌన్సిల్‌లలో అడ్వకెట్‌గా నమోదు చేసుకుని ఉండరాదు. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
READ ALSO : Healthy Skin : ఆరోగ్యకరమైన చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఇవే !
ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత డాక్యుమెంట్లతో రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), AP హైకోర్టు, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522238. దరఖాస్తులకు చివరి తేదీ జులై 22, 2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ; https://hc.ap.nic.in/ పరిశీలించగలరు.