Senior Scientist positions : ఐఐటీఆర్ లఖ్ నవూలో సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎన్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. సైంటిస్ట్ పోస్టులకు 32 ఏళ్లు నీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 8 ఏళ్లు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు 5 ఏళ్లు అనుభవం ఉండాలి.

IITR Lucknow
Senior Scientist positions : సీఎన్‌ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రిసెర్చ్ (ఐఐటీఆర్) లఖ్ నవూలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సైంటిస్ట్ 9, సీనియర్ సైంటిస్ట్ 2, ప్రిన్సిపల్ సైంటిస్ట్ 1 ఖాళీ ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Pawan Kalyan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎన్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. సైంటిస్ట్ పోస్టులకు 32 ఏళ్లు నీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 8 ఏళ్లు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు 5 ఏళ్లు అనుభవం ఉండాలి.
READ ALSO : BNP Dewas Recruitment : బ్యాంక్ నోట్ ప్రెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల ఎంపిక పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి వేతనంగా నెలకు సైంటిస్ట్ రూ.1,15,548, సీనియర్ సైంటిస్ట్ రూ.1,32,864 ప్రిన్సిపల్ సైంటిస్ట్ రూ.2,01972 చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదిగా సెప్టెంబర్ 5, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://iitrindia.org/ పరిశీలించగలరు.