AWES Recruitment : హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టు అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్క్రూటినీ, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

AWES Recruitment : హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

Army Public School

Updated On : September 24, 2023 / 1:00 PM IST

AWES Recruitment : గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : TTD Bus Theft : టీటీడీ ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీ .. జీపీఎస్ ద్వారా గర్తింపు

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 02, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 05 , ప్రైమరీ టీచర్ (పీఆర్టీ): 02 , అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): 01, లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ): 01 , కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్: 01 , సైన్స్ ల్యాబ్ అటెండెంట్: 03 , మల్టీటాస్కింగ్ స్టాఫ్: 02 , గార్డెనర్: 01 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టు అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్క్రూటినీ, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

READ ALSO : Hair Extensions : హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారా? తరచూ వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

అర్హతలున్నవారు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుండి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోని పూర్తి చేసిన దరఖాస్తులకు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జతచేసి నిర్ణీతగడువులోగా చిరునామా: Army Public School Golconda Hydersha kote, Near Suncity, Hyderabad-500031. పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 నిర్ణయించారు. దరఖాస్తు పంపేందుకు చివరితేదిగా 10.10.2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.apsgolconda.edu.in/ పరిశీలించగలరు.