TTD Bus Theft : టీటీడీ ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీ .. జీపీఎస్ ద్వారా గర్తింపు

వాహనాలు చోరికి గురైనా సమాచారం అందించకపోవడంతో ఏఫ్‌ఐ‌ఆర్ లో జియం పేరు చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఏఫ్‌ఐ‌ఆర్‌లో జీయం పేరు చేరితే సస్పెండ్ చేసే యోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

TTD Bus Theft : టీటీడీ ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీ .. జీపీఎస్ ద్వారా గర్తింపు

TTD Bus

Tirumala Tirupati Devasthanam: తిరుమలలో టీటీడీకి చెందిన ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీకి గురైంది. బస్సు కనిపించక పోవటంతో కంగుతిన్న సిబ్బంది టీటీడీ ట్రాన్స్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు జీపీఎస్ సహాయంతో బస్‌ను ట్రాక్ చేసి ఎక్కడ ఉందో గుర్తించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో బస్సు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఛార్జింగ్ అయిపోవడంతో బస్సును దొంగలు వదిలిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సును తిరిగిరి తీసుకొచ్చేందుకు పోలీసులు, టీటీడీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

TTD Brahmotsavam : సెప్టెంబరు 18 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు విడుదల చేసిన టీటీడీ చైర్మన్, ఈఓ

టీటీడీ ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీకి గురికావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ టీటీడీకి చెందిన బ్యాటరీ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బ్యాటరీ వాహనం చార్జింగ్ అయిపోవడంతో కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద వదిలివెళ్లారు. మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంతో అధికారుల నిఘా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు చోరీ ఘటన నేపథ్యంలో.. టీటీడీ ట్రాన్స్‌పోర్ట్ జీయం‌పై పోలీసులు సీరియస్ అయ్యారు.  వారంరోజుల క్రితం కారు మిస్సింగ్ ఘటన‌పై కూడా పోలీసులకు ట్రాన్స్‌పోర్టు జీయం శేషా‌రెడ్డి సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇవాళ బస్సు మిస్సింగ్ ఘటనలోనూ మీడియాలో వార్తలు వచ్చే వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో బ్రహ్మోత్సవాల ప్రారంభం సమయంలో భక్తుల భధ్రత దృష్ట్యా ట్రాన్స్‌పోర్ట్‌ జీఎంకు పోలీసులు ముందస్తుగా మెమో ఇచ్చినట్లు తెలిసింది.

Motkupalli Narasimhulu : చివరికి దేవాన్షును కూడా జగన్ అరెస్ట్ చేస్తాడేమో! చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మోత్కుపల్లి నిరసన దీక్ష

భక్తులకు సంభంధించిన రవాణా వాహనాలకు పూర్తి స్థాయిలో భధ్రతా ఏర్పాట్లు పరిశీలన జరిపి.. పూర్తి భాధ్యతను జీయం వహించాలని పోలీసులు ఆదేశించారు. వాహనాలు చోరికి గురైనా సమాచారం అందించకపోవడంతో ఏఫ్‌ఐ‌ఆర్ లో జియం పేరు చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఏఫ్‌ఐ‌ఆర్‌లో జీయం పేరు చేరితే సస్పెండ్ చేసే యోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.