Vizagsteel Recruitment : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

Vizagsteel Recruitment : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

vizagsteel Recruitment

Updated On : November 2, 2022 / 9:30 PM IST

Vizagsteel Recruitment : ఏపిలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 మైన్ ఫోర్‌మ్యాన్, ఆపరేటర్-కమ్-మెకానిక్, మైన్ మేట్, బ్లాస్టర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఖాళీల వివరాలు పరిశీలిస్తే మైన్ ఫోర్‌మ్యాన్ పోస్టులు 2, ఆపరేటర్-కమ్-మెకానిక్ పోస్టులు 19, మైన్ మేట్ పోస్టులు 4, బ్లాస్టర్ పోస్టులు 2, డ్రిల్ టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించరాదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.37,000ల నుంచి రూ.39,000ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.vizagsteel.com/ Recruitment పరిశీలించగలరు.