APSCSCL Recruitment 2023 : ఏపీ సివిల్ సప్లైస్ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్‌ పోస్ట ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అందజేయాలి.

APSCSCL Recruitment 2023

APSCSCL Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్సొరేషన్‌ లిమిటెడ్‌, పార్వతీపురం జిల్లా కార్యాలయం లో ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది నియామకాలను చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : NBA Recognition : ఏపిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచ్ లకు ఎన్ బిఏ గుర్తింపు

ఖాళీల వివరాలు:

టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌: 9 ఖాళీలు ఉన్నాయి.

అర్హత:

బీఎస్సీ (అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌ / బయోటెక్నాలజీ/ డ్రైల్యాండ్‌అగ్రికల్చర్‌/ బాటనీ) ఉత్తీర్ణులై ఉండాలి.

READ ALSO : Water Fasting : వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది ?

వయోపరిమితి:

అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:

అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

READ ALSO : Benefits of Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఎన్నో లాభాలు తెలుసా ?

దరఖాస్తు విధానం:

అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్‌ పోస్ట ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ;

డిస్ట్రిక్ట్‌ సివిల్‌ సఫ్టైన్‌ మేనేజర్‌ ఆఫీస్‌, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం, సబ్‌ కలెక్టరేట్‌ కాంపౌండ్‌, పార్వతీపురం, మన్యం జిల్లా చిరునామాకు పంపాలి.

READ ALSO : Chandrababu Naidu : రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. 28న బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://parvathipurammanyam.ap.gov.in/ పరిశీలించగలరు.

 

ట్రెండింగ్ వార్తలు