Chandrababu Naidu : రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. 28న బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో నవంబర్ 20న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Chandrababu Naidu : రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. 28న బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

Chandrababu Naidu

Chandrababu Delhi Toru: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 27న ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు చంద్రబాబు హాజరవుతారు. సోమవారం రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్ లో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు హాజరవుతారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకుంటారు. చంద్రబాబు కేసులకు సంబంధించి హైకోర్టుల్లో సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Also Read : Rahul Gandhi : కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం : రాహుల్ గాంధీ

ఇదిలాఉంటే మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో నవంబర్ 20న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవంబర్ 21న ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు తమ పరిధిదాటి వ్యవహరించినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును కోరింది.