NBA Recognition : ఏపిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచ్ లకు ఎన్ బిఏ గుర్తింపు

రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ నుండి గుర్తింపు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ఆన్‌లైన్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతోపాటు, మౌలికసదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నారు.

NBA Recognition : ఏపిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచ్ లకు ఎన్ బిఏ గుర్తింపు

Polytechnic Colleges in AP

NBA Recognition : ఆంధ్రప్రదేశ్ లోని 9 గవర్నమెంట్ పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని 16 బ్రాంచ్‌లకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (National Board of Accreditation) గుర్తింపు లభించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టటమే దీనికి కారణం. ఇదే విషయాన్ని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. మొదటి దశలో 41 పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ గుర్తింపుకోసం ప్రపోజల్ పెట్టగా ఇప్పటి వరకు 18 పాలిటెక్నిక్‌లకు ఈ గుర్తింపును దక్కించుకున్నాయి.

READ ALSO : Man Burnt Alive : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

గుర్తింపు దక్కించుకున్న 9 కాలేజీలు ఇవే:

ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్-గుంటూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్- ఆత్మకూరు. ఈఎస్‌సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్- నంద్యాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్-కలికిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్-పార్వతీపురం, గవర్నమెంట్ పాలిటెక్నిక్-రాజంపేట, గవర్నమెంట్ పాలిటెక్నిక్-కాకినాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్- ధర్మవరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్-చంద్రగిరి పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి.

READ ALSO : Hyderabad DRDO Recruitment 2023 : హైదరాబాద్‌ డీఆర్‌డీవో సెప్టమ్‌ లో ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ

మరో రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ నుండి గుర్తింపు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ఆన్‌లైన్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతోపాటు, మౌలికసదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నాటికి 43 పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఎన్‌బీఏ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి స్పష్టం చేశారు.