BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ తిరుచిరాపల్లిలో పలు అప్రెంటిస్ ఖాళీల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Bharat Heavy Electrical Limited Tiruchirappalli
BHEL Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 575 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి టెక్నీషియన్ విభాగంలో మెకానికల్ 52ఖాళీలు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15, సివిల్ ఇంజనీరింగ్ 10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 06, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 6, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 1 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విభాగంలో మెకానికల్ 52, సీఎస్‌ఈ/ఐటీ 15, సివిల్ ఇంజనీరింగ్ 8, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 6, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2, కెమికల్ ఇంజనీరింగ్ 1, అకౌంటెంట్ 4, అసిస్టెంట్ హెచ్‌ఆర్ 3, బీఎస్‌సీ నర్సింగ్ 2, బి. ఫార్మ్ 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఐటీఐ విభాగంలో ఫిట్టర్ (186), వెల్డర్ 120, ఎలక్ట్రీషియన్ 34, టర్నర్ 14, మెషినిస్ట్ 14, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ 6, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 6, కార్పెంటర్ 4 , మెకానిక్ మోటార్ వెహికల్ 4, ప్లంబర్ 2 ఖాళీలు ఉన్నాయి.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియకు తుదిగడువు 7 సెప్టెంబర్ 2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://trichy.bhel.com/ పరిశీలించగలరు.