UPSC : కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 161 పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ ( ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

UPSC : కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 161 పోస్టుల భర్తీ

Upsc Jobs

Updated On : May 30, 2022 / 7:33 PM IST

UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 161 ఖాళీలు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి డ్రగ్ ఇన్ స్పెక్టర్లు 3 ఖాళీలు, అసిస్టెంట్ కీపర్ 1ఖాళీ, పోస్ట్ మాస్టర్ 1 ఖాళీ, మినరల్ ఆఫీసర్లు ఇంటెలిజెన్స్ 20 ఖాళీలు, అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్లు 2 ఖాళీలు, సీనియర్ లెక్చర్లు 3 ఖాళీలు, వైస్ ప్రిన్సిపల్ 131 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ ( ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా జూన్ 16, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.upsc.gov.in పరిశీలించగలరు.