Jobs : ముంబాయి బార్క్ లో పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ కెమెస్ట్రీ, ఉత్తీర్ణులై ఉండాలి.

Jobs : ముంబాయి బార్క్ లో పోస్టుల భర్తీ

The Sun Lights The Distant Mountain At Emerald Lake From The Canoe Rental Dock.

Updated On : April 4, 2022 / 10:31 AM IST

Jobs : ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బాబా అటమిక్ రిసెర్చ సెంటర్ (బార్క్)లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కెమిస్ట్ర్రీ, కెమికల్, మెకానికల్,సివిల్, ఎలక్ట్రికల్, సెఫ్టీ, లైబ్రరీ సైన్సు, రిగ్గర్తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టుల ఖాళీలకు సంబంధించి స్ట్రైపెండరీ ట్రైనీలు 260, సైంటిఫిక్ అసిస్టెంట్ 1, టెక్నీషియన్స్ 5 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ కెమెస్ట్రీ, ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 30, 2022ని చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://nrbapply.formflix.com/home సంప్రదించగలరు.