Replacement : తెలంగాణా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ
ఈ నోటిఫికేషన్ ద్వారా 445 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో 372 స్టాఫ్ అసిస్టెంట్లు, 73 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

Dccb Jobs (1)
Replacement : తెలంగాణా వ్యాప్తంగా ఉన్న స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అధ్వర్యంలో నడుస్తున్న వివిధ జిల్లాలకు చెందిన జిల్లా స్ధాయి కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 445 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో 372 స్టాఫ్ అసిస్టెంట్లు, 73 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే అదిలాబాద్ 69, హైదరాబాద్ 52, కరీంనగర్ 84, మహబూబ్ నగర్ 32, మెదక్ 72, నల్గొండ 36, వరంగల్ 50, ఖమ్మం 50, ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణఉలై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్ లైన్ పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదిగా మార్చి 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://tscab.org/ సంప్రదించగలరు.