SBI Jobs : డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం 60వేలు.. 5వేలకుపైగా పోస్టులు, అర్హతలు ఇవే
Bank Jobs : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI CBO Recruitment 2023 (Photo : Google)
మీరు డిగ్రీ పాస్ అయ్యారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బీఐలో 5వేలకు పైగా కొలువులు భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా 5వేల 280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు విద్యార్హత ఏంటి? వయో పరిమితి ఎంత? పరీక్ష ఎప్పుడు పెడతారు? ఏ విధంగా ఉంటుంది? ఫీజు ఎంత? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం..
Also Read : లక్షకు పైగా వేతనం.. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
విద్యార్హత – డిగ్రీ
వయసు – 21 నుంచి 30 ఏళ్లు
అనుభవం – ఏదైనా కమర్షియల్ బ్యాంకు లేదా రీజనల్ గ్రామీణ బ్యాంకులో రెండేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి.
జీతం – రూ.36వేల నుంచి రూ.63వేల 840
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 825 ఖాళీలు.
2024 జనవరిలో ఆన్ లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం.
దరఖాస్తు తేదీ ప్రారంభం – నవంబర్ 22.
దరఖాస్తుకు చివరి తేదీ- డిసెంబర్ 12.
ఆన్ లైన్ లో (sbi.co.in) అప్లయ్ చేసుకోవాలి.
Also Read : ఇంజనీరింగ్ లో ఉపాధి అవకాశాలు, అధిక వేతనాలు అందిపుచ్చుకునే కోర్సులు ఇవే !
మొత్తం పోస్టులు – 5280.
దరఖాస్తు ఫీజు(జనరల్ కేటగిరీ) -750రూపాయలు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.
ఆన్ లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
ఆబ్జెక్టివ్ టెస్ట్-120 మార్కులకు (2 గంటల సమయం, నాలుగు సెక్షన్లు)
డిస్ క్రిప్టివ్ టెస్ట్ – 50 మార్కులకు ( 30 నిమిషాల సమయం).. ఇంగ్లీష్ భాషపై టెస్ట్… లెటర్ రైటింగ్, ఎస్సే..