NFL Management Trainee Recruitment 2023 : లక్షకు పైగా వేతనం.. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

మేనేజ్‌మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్కెటింగ్ లేదంటే ఇతర సబ్జెక్టులో 2 సంవత్సరాల ఫుల్ టైం MBA / PGDM / PGDBM డిగ్రీని కలిగి ఉండాలి.

NFL Management Trainee Recruitment 2023 : లక్షకు పైగా వేతనం.. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

NFL Management Trainee Recruitment 2023

NFL Management Trainee Recruitment 2023 : మినీ రత్న కంపెనీలలో ఒకటైన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో(NFL) పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్ధలో ఖాళీగా ఉన్న వివిధ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

READ ALSO : Election Counting: ఎన్నికల తర్వాత EVMల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? కౌంటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం

ఖాళీల వివరాలు ;

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటిలో మేనేజ్‌మెంట్ ట్రైనీ మార్కెటింగ్‌లో 60, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఎఫ్‌అండ్‌ ఏ 10, మేనేజ్‌మెంట్ ట్రైనీ లా 4 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Telangana Assembly Election 2023 : పెరుగుతున్న ఎన్నికల ప్రచార వ్యయం…అప్పుల కోసం అభ్యర్థుల యత్నం

అర్హత ;

మేనేజ్‌మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్కెటింగ్ లేదంటే ఇతర సబ్జెక్టులో 2 సంవత్సరాల ఫుల్ టైం MBA / PGDM / PGDBM డిగ్రీని కలిగి ఉండాలి.

మేనేజ్‌మెంట్ ట్రైనీ F&A పోస్టుకు గ్రాడ్యుయేషన్‌తో పాటు CA లేదంటే ICWA లేదా CMA పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

మేనేజ్‌మెంట్ ట్రైనీ లా పోస్ట్ కు న్యాయశాస్త్రంలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదంటే 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బి డిగ్రీని కలిగి ఉండాలి.

READ ALSO : Sail Recruitment 2023 : పదోతరగతి పాసయ్యారా ? అయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి !

వయస్సు ;

అన్ని పోస్టులకు వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.

ఎంపిక ప్రక్రియ :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల తుది ఎంపిక జరుగుతుంది. పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో OMR సీటు ఆధారంగా ఉంటుంది. రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.

READ ALSO : Nara Lokesh : నవంబర్ 24 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం

వేతనం ;

ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 నుండి రూ.1,40,000 వరకు జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు ;

అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి దరఖాస్తుదారుని వివరాలను ఫారమ్‌లో నమోదు చేయాలి. ఫోటో, సంతకం,అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

READ ALSO : Today Headlines : విశాఖ బోట్ల దగ్ధంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. నేడు తెలంగాణకు మరోసారి అమిత్‌షా

దరఖాస్తుకు చివరి తేది ;

నవంబర్ 2 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి గడువు తేదిగా డిసెంబర్ 1,2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nationalfertilizers.com/ పరిశీలించగలరు.