Nara Lokesh : నవంబర్ 24 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం

అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.

Nara Lokesh : నవంబర్ 24 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం

Nara Lokesh Yuvagalam Padayatra (2)

Updated On : November 20, 2023 / 12:02 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేష్ నవంబర్ 24 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208వ రోజు పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, కోనసీమ జిల్లా వద్ద పాదయాత్ర ఆగి పోయింది.

అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.

Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు

దీంతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో విశాఖ వరకే చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నట్లుగా సమాచారం.