SBI PO Notification: ఎస్బీఐ పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల.. రూ.48 వేల జీతం.. పూర్తి వివరాలు మీకోసం
SBI PO Notification: ఎస్బీఐ బ్యాంకు పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 541 పోస్టులను భర్తీ చేయనున్నారు.

SBI Po Notification 2025 Released
బ్యాంకు ఉద్యోగం చేయడం మీ కలనా. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసం. ఎస్బీఐ బ్యాంకు పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 541 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్ 24 నుండి జులై 14 వరకు దరఖాస్తు గడువును నిర్ణయించారు. ఆసక్తి అర్హత ఉన్నవారు. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibpsonline.ibps.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. Also Read: ఇంటర్ పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. SSC CHSL రిజిస్ట్రేషన్ మొదలు.. ముఖ్యమైన వివరాలు మీకోసం
పోస్టుల వివరాలు: మెుత్తం 541 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అందులో 203 పోస్టులు జనరల్ కేటగిరీ, 135 పోస్టులు వెనుకబడిన తరగతుల వారికి, 50 పోస్టులు ఆర్థికంగా బలహీన వర్గాలకు, 37 పోస్టులు షెడ్యూల్డ్ కులాల వారికోసం, 75 పోస్టులు షెడ్యూల్డ్ తెగలు కేటగిరీ అభ్యర్థుల కోసం రిజర్వ్ చేశారు.
విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయ కళాశాల లేదా కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం / సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 1 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు లభిస్తుంది.
జీతం: ఎస్బీఐ పీఓ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480 జీతం, ఇతర రకాల అలవెన్సులు ఉంటాయి.Also Read: టెన్త్ తర్వాత ఏ రూట్ లో వెళితే మంచిది? ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఫుల్ డీటెయిల్స్
దరఖాస్తు రుసుము: అన్‌రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ. 750 రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యీబీడీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము ఉండదు.
ఎంపిక విధానం: అభ్యర్థులను టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. టైర్ 1 పరీక్ష జూలై లేదా ఆగస్టులో ఉండే అవకాశం ఉంది.