Minorities Scholarship: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకోసం రూ.20 లక్షలు.. పూర్తి వివరాలు మీకోసం

సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ మైనారిటీస్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.

Minorities Scholarship: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకోసం రూ.20 లక్షలు.. పూర్తి వివరాలు మీకోసం

CM Overseas Scholarship for Minorities

Updated On : June 15, 2025 / 9:41 AM IST

తెలంగాణలోని మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ మైనారిటీస్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పథకం కింద విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తుంది. చాలా మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆర్ధిక సహాయాన్ని అందించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30.

అర్హత: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తెలంగాణ నివాసితులై ఉండాలి. ఇస్లాం, సిక్, క్రిస్టియన్, బౌద్ధ, జైన, పార్సి వర్గాలకు చెందినవారై ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు సాదించాలి. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ పొందాలి.

వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 35 సంవత్సరాలు మించకూడదు.

అవసరమైన పత్రాలు: విద్యా అర్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కమ్యూనిటీ సర్టిఫికెట్, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ స్కోర్ కార్డు.

అధికారిక వెబ్ సైట్ www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.