College Admissions : ఆగస్టు 1, 2వ తేదీలలో టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఆగస్టు 1, 2వ తేదీలలో ఉదయం 7 గంటలకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

Ttd Junior College Admissions
Junior College Admissions : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఆగస్టు 1, 2వ తేదీలలో ఉదయం 7 గంటలకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
టీటీడీలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పిల్లలు, బాలమందిర్ పిల్లలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు, సీటు వచ్చి వివిధ కారణాలతో మూడు విడతలలో కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు, తిరుపతిలోని స్థానిక విద్యార్థి, విద్యార్థునులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆగస్టు 1న 450 మార్కులకు పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులు, ఆగస్టు 2న 450 మార్కులు కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు హాజరు కావచ్చు.
ఆగస్టు 2వ తేదీన హాజరు అగు విద్యార్థులు 1వ తేదీ రాత్రి టీటీడీ వెబ్‌సైట్ నందు పొందుపరిచిన ఖాళీల వివరాలు చూసుకుని హాజరు కావలసిందిగా టీటీడీ కోరింది. కళాశాలలో మార్కుల ప్రాతిపదికన ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు. హాస్టల్ వసతి స్పాట్ అడ్మిషనుల వారికి కేటాయించరు, కావున ఈ విషయాన్ని విద్యార్థులు గమనించగలరు.
ఇదివరకే http://admissions.tirumala.org ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, సంబంధిత కళాశాలలో సీట్లు మాత్రమే కావాల్సివారు, ధ్రువీకరణపత్రాలు, ఫీజులతో నేరుగా సంబంధిత జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది.