SSC GD Constable 2024 : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే !

మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలుగా నిర్ణయించారు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి.

SSC GD Constable 2024 : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే !

SSC GD Constable 2024

SSC GD Constable 2024 : కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు.

READ ALSO : Vishakapatnam : బోట్లు ఎలా కాలిపోయాయో చెప్పిన విశాఖ సీపీ

భర్తీ చేయనున్న వాటిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 6174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 11025 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,189 పోస్టులు,సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్‌(SSB)లో 635 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 1,490 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 296 పోస్టులు ఉన్నాయి.

వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 26,146,

మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు.

READ ALSO : Maharashtra : బర్త్ డే సెలబ్రేట్ చేయలేదని ఓ భార్య అఘాయిత్యం.. భర్తను..

పోస్టుల కేటాయింపు:

యూఆర్-10,809, ఈడబ్ల్యూఎస్-3633, ఓబీసీ-5360, ఎస్టీ-2602, ఎస్సీ-3742.

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

READ ALSO : Airtel New Mobile Plan : ఎయిర్‌టెల్ కొత్త మొబైల్ ప్లాన్ ఇదిగో.. ఫ్రీగా నెట్‌ఫిక్స్ చూడొచ్చు.. రోజుకు డేటా ఎంతంటే?

వయోపరిమితి:

18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

READ ALSO : ముస్లిం రిజర్వేషన్లకు చరమ గీతం పాడుతాం..!

దరఖాస్తు ఫీజు:

పురుషులకు రూ.100 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

వేతనం:

ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం చెల్లిస్తారు.

READ ALSO : IMD Latest Bulletin : బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం:

మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలుగా నిర్ణయించారు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. వచ్చేఏడాది 2024 ఫిబ్రవరి లేదా మార్చిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 భారతీయ భాషల్లోనూ పరీక్ష ఉంటుంది.

READ ALSO :Prime Minister Narendra Modi : వాయుసేన దుస్తుల్లో మోదీ తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణం

దరఖాస్తు తేదీలు ;

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 31.12.2023.

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.01.2024

పూర్తి వివరాలు వెబ్ సైట్ ; https://ssc.nic.in/ పరిశీలించగలరు.