Prime Minister Narendra Modi : వాయుసేన దుస్తుల్లో మోదీ తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సందర్శన సందర్భంగా తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను సమీక్షించేందుకువచ్చిన మోదీ వాయుసేన దుస్తులు ధరించి తలకు హెల్మెట్ పెట్టుకొని తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.....

Prime Minister Narendra Modi : వాయుసేన దుస్తుల్లో మోదీ తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణం

Narendra Modi

Updated On : November 25, 2023 / 1:20 PM IST

Prime Minister Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సందర్శన సందర్భంగా తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను సమీక్షించేందుకువచ్చిన మోదీ వాయుసేన దుస్తులు ధరించి తలకు హెల్మెట్ పెట్టుకొని తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

స్వదేశంలోనే రక్షణ ఉత్పత్తుల తయారీ

రక్షణ ఉత్పత్తులను స్వదేశంలో ఉత్పత్తి చేసేందుకు మోదీ ప్రయత్నాలు ప్రారంభించారు. యూఎస్ డిఫెన్స్ దిగ్గజ సంస్థ జీఈ ఏరోస్పేస్, హెచ్ఏఎల్ కలిసి సంయుక్తంగా ఎంకే -తేజస్ ఫైటర్ జెట్ తయారీ కోసం ఇంజన్లను ఉత్పత్తి చేసింది. 2022-2023వ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయని ఈ ఏడాది ఏప్రిల్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Modi

Modi

తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణం అద్భుతం

తేజస్ ఫైటర్ జెట్ల తయారీ భారతదేశానికి అద్భుతమైన విజయమని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.తేజస్‌పై ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ‘‘ తేజస్ ఫైటర్ జెట్ పై ప్రయాణం విజయవంతంగా సాగింది. ఈ అనుభవం అద్భుతంగా ఉంది. మన దేశ స్వదేశీ సామర్ధ్యాలపై నా విశ్వాసాన్ని తేజస్ పెంచింది’’ అని నరేంద్రమోదీ ఎక్స్ పోస్టులో తేజస్ ప్రయాణ చిత్రాలతో పంచుకున్నారు.