Sbi Recruitment : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

షార్ట్ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు కార్పొరేట్ సెంటర్, ముంబయిలో పనిచేయవల్సి ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.63,840ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.

Sbi Recruitment : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

SBI Recruitment

Updated On : December 11, 2022 / 10:02 PM IST

Sbi Recruitment : ముంబాయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్), మాస్టర్ డిగ్రీ(ఫైనాన్స్ కంట్రోల్‌), మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పీజీడీఎం(ఫైనాన్స్) లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబందిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

షార్ట్ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు కార్పొరేట్ సెంటర్, ముంబయిలో పనిచేయవల్సి ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.63,840ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 29, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sbi.co.in/ పరిశీలించగలరు.