TCSలో భారీగా ఉద్యోగాలు.. 43వేల మంది ఫ్రెషర్లకు ఛాన్స్!

భారత అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకించి ఫ్రెషర్ల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

TCSలో భారీగా ఉద్యోగాలు.. 43వేల మంది ఫ్రెషర్లకు ఛాన్స్!

Tcs Hires 43,000 Freshers In H1 Fy22

Updated On : October 8, 2021 / 10:19 PM IST

TCS hire  freshers : భారత అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకించి ఫ్రెషర్ల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 35వేల మంది గ్రాడ్యుయేట్లను కొత్తగా నియమించుకోవాలని భావిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. గత ఆరు నెలల్లో 43వేల మంది గ్రాడ్యుయేట్లను TCS నియమించుకుంది. Q2లో నికర ప్రాతిపదికన 19,690 మంది ఉద్యోగులను టీసీఎస్ ఇప్పటికేనియమించుకుంది. సెప్టెంబర్ 30 నాటికి టీసీఎస్ లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,28,748కు చేరింది.
OnePlus 9RT కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా?

టీఎసీఎస్ ఉద్యోగుల్లో మొత్తం సంఖ్యలో 36.2శాతం మహిళ ఉద్యోగులు ఉన్నారు. TCS అట్రిషన్ రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 11.9శాతంకి పెరిగింది. ఐటీ ఇండస్ట్రీలో ఇదే అత్యల్పం. గత త్రైమాసికంలో ఇది 8.6%శాతం ఉంది. అట్రిషన్ స్థాయిలపై కంపెనీల్లో ఆందోళన నెలకొంది. రాబోయే రెండు మూడు త్రైమాసికాల వరకు ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అందుకే నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కంపెనీ భావిస్తోంది.

మరోవైపు కరోనావైరస్ నేపథ్యంలో ఇప్పటి వరకు 70శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. 95శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేయించుకున్నారు. పూర్తిడోసులు తీసుకున్న ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రప్పించేందుకు అవసరమైన ప్రణాళికలను కంపెనీ సన్నద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి పూర్తిగా టీకాలు తీసుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులను మాత్రమే ఆఫీసులకు అనుమతించినట్టు TCS ఒక ప్రకటనలో వెల్లడించింది.
Apple Festive Offer: భారత్‌లో ఐఫోన్ 13 సిరీస్‌పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!